Kuja dosha remedies


కుజదోషం అంటే ఏమిటి? 

కుజదోషమనగా జాతక చక్రంలో లగ్నము నుండి గాని, చంద్ర రాశి నుండి గాని, శుక్రుడున్న రాశి నుండి గాని 2, 4, 7, 8, 12 రాశులలో కుజుడున్న దోషము. 

కుజుడు కళత్ర నాశనము చేయువాడు. శుక్రుడు కళత్ర కారకుడు. వీరిరువురి కలయిక లేదా శుక్రునిపై కుజుని దృష్టి వధూవరులలో ఏ ఒక్కరి జాతకంలో  ఉన్ననూ అది కుజదోషంగా పరిగణిస్తారు. 

ఒకరి జాతకంలో కుజదోషముండి ఇంకొకరి జాతకంలో లేకున్న యెడల అట్టి వధూవరులకు వివాహము చేయరాదు.  


కుజదోషం పరిహారాలు : 

శ్లో||                  అర్కేందు క్షేత్రజాతానాం  కుజదోష నవిద్యతే |
                       స్వేచ్చామిత్రజాతానాం పీడకోనభవేత్కల ||   

మేష, వృశ్చిక, కర్కాటక, సింహా, ధనస్సు, మీన, మకర లగ్నజాతకులకు కుజదోషము వుండదు. చూడవలసిన అవసరం లేదు. 

1. కుజ చంద్రులు, కుజ గురువులు కలిసిన దోషాపరిహారం. 

2. కుజుడు 2వ ఇంట ఉన్ననూ, జన్మలగ్నం మేషం గాని, కన్య గాని అయినచో దోషం లేదు.
 
3. 9వ స్థానంలో బలమైన శుభగ్రహములున్న కుజదోషం వర్తించదు. 

4. వృషభ, తుల లగ్న జాతకులకు 12వ స్థానంలో శుభగ్రహములున్న కుజదోషం వుండదు. 

5. మేష, వృశ్చిక లగ్న జాతకులకు 4వ స్థానంలో శుభగ్రహములున్న కుజదోషం వుండదు.
 
6. మకర, కర్కాటక లగ్న జాతకులకు 7వ స్థానంలో శుభగ్రహములున్న కుజదోషం వుండదు. 

7. ధనుర్, మీన లగ్న జాతకులకు 8వ స్థానంలో శుభగ్రహములున్న కుజదోషం వుండదు. 

8. లగ్నంలో మరియు 4, 9, 12 స్థానములలో శనిగ్రహము ఉన్నచో కుజదోషం వుండదు. 

9. స్త్రీ జాతకంలో ద్వితీయమందు పూర్ణ చంద్రుడు గాని బుధ, గురు, శుక్రులలో ఏ ఒక్క                            గ్రహమున్ననూ కుజదోషం వర్తించదు. 

10. వధూవరుల ఇద్దరి జాతకంలో 2, 7 స్థానములలో పాప గ్రహములున్న కుజదోషం వర్తించదు. 

11. సమాన దోషమున్నను, ఒకరి జాతకమున లగ్నము నుండి మరొకరి జాతకమున చంద్ర, శుక్ర               స్థానములనుండి కుజదోషమున్నను దోష పరిహారమే. వారికి వివాహము చేయవచ్చును.  
 

 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు