Balaristam

Balaristam - బాలారిష్ట దోషములు:

బిడ్డ పుట్టిన సమయం - లగ్నము నుండి 8వ రాశిలో చంద్రుడు, 7వ రాశిలో  కుజుడు, 9వ రాశిలో రాహువు, లగ్నంలో శని,  3వ రాశిలో  గురుడు, 5వ రాశిలో  శుక్రుడు, 6వ రాశిలో  బుధుడు, 12వ రాశిలో  కేతువు  ఉన్నచో దానిని బాలారిష్టం అందురు. 

జన్మలగ్నము నకు 1,5,6,7,8,12 భావాలలో పాప గ్రహములున్న లేక పాప గ్రహములచే చూడబడుచున్నా, ఇంకా క్షీణ చంద్రుడు 12వ రాశిలో ఉండగా 1,8 భావములలో పాప గ్రహాలున్నా బాలారిష్ట దోషము ఉన్నదని గ్రహించాలి. 

బాలారిష్ట దోషములు భంగములు : పైన చెప్పిన విధంగా పాప గ్రహములున్నప్పటికీ , ఆ రాశులపై  బలమైన శుభగ్రహముల ద్రుష్టి ఉన్నా, కేద్రస్థానాలయిన  1,4,7,10 రాశులందు కనీసం ఒక శుభగ్రహమున్నా బాలారిష్ట దోషము తొలగి దీర్ఘాయుష్షు కలుగును.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు