నవగ్రహశాంతి
సూర్య గ్రహము: యధావిధిగా పూజించి, సూర్య నమస్కారములు చేసినను, ఎర్రపువ్వులచే పూజించినను, ఎర్రగుడ్డ, మాణిక్యము ధరించినను, ఎర్ర ఆవు లేక గోధుమలు దానము చేసినను దోషనివృత్తి కలుగును.
చంద్ర గ్రహము: యధావిధిగా పూజించి, శ్వేత పుష్పములచే పూజించినను, శ్వేతవస్త్రము, ముత్యములు వీటిని ధరించినను, శంఖము లేక బియ్యము వీటిని దానము చేసినను దోషనివృత్తి కలుగును.
కుజ గ్రహము: యధావిధిగా పూజించి రక్తవస్తము, పగడములు ధరించినను, ఎర్రయెద్దు లేక కందులు వీటిని దానము చేసినను దోష నివృత్తి కలుగును.
బుధ గ్రహము: యధావిధిగా పూజించి, పీతాంబరము, మరకతము వీటిని ధరించినను, సువర్ణము లేక పెసలు వీటిని దానము చేసినను దోషనివృత్తి కలుగును.
గురు గ్రహము: యధావిధిగా పూజించి, పుష్యరాగము, పసుపు వస్త్రము ధరించినను, శెనగలు దానము చేసినను దోషనివృత్తి కలుగును.
శుక్ర గ్రహము: యధావిధిగా పూజించి, శ్వేతవస్త్రము, వజ్రము ధరించినను, వెండి, తెల్లటి గుజ్జిము, అనుములు వీటిని దానము, చేసినను దోషనివృత్తి కలుగును.
శని గ్రహము: యధావిధిగా పూజించి, నల్లని వస్త్రము, ఇంద్రనీలము ధరించినను, నల్ల ఆవు లేక నువ్వులు వీటిని దానము చేసినను దోషనివృత్తి కలుగును.
రాహు గ్రహము: యధావిధిగా పూజించి, గోమేధికమును ధరించినను, కత్తి, ఇనుము, ఉద్దులు (మినుములు) వీటిని దానము చేసినను దోషనివృత్తి కలుగును.
కేతు గ్రహము: యధావిధిగా పూజించి, వైఢధూర్యము ధరించినను, దానము చేసినను, ఉలవలు దానము చేసినను దోషనివృత్తి కలుగును.
0 కామెంట్‌లు