గృహప్రవేశ ముహూర్తము
ఉత్తరాయణము - మాఘ, పాల్గుణ, వైశాఖ, జ్యేష్టమాసములు ప్రశస్తము. కుంభమాసము మంచిదికాదు. శుక్షపక్షము 2,3,5,7,10,13 తిథులు కృష్ణపక్షమున చివర పంచకముగాక 1-2-8-5 తిథులు మంచివి. అవమాత్రిద్యుస్పృక్ మొదలగు దుష్టతిథులు పనికిరావు. బుధ, గురు, శుక్రవారములు పూర్ణేందువారము మంచివి. రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త అనూరాధ, ఉత్తరాషాఢ,శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి - ఈ నక్షత్రములు ప్రశస్తములు. అశ్విని, పునర్వసు, హస్త, స్వాతి, శ్రవణం - ఈ నక్షత్రములయందు గృహమున ప్రవేశించిన గృహము కొలది కాలములోనే అన్యాక్రాంతమగును. శేషించిన నక్షత్రములు మంచివి కానేరవు. వరిఘాది యోగములు భద్రకరణము మంచివికావు. కర్తరియందు గృహమునకు శంఖుస్థాపన మొనరించినను గృహనిర్మాణ మొనరించినను అగ్నిహోత్ర ప్రీతికరములగునని కాలామృతము, కృష్ణవాస్తు మొదలగు గ్రంథములు చెప్పుచున్నవి. ప్రవేశము చేయవచ్చునని కొందరి అభిప్రాయము. జన్మరాశియందు గృహప్రవేశము శుభప్రదము. గురు శుక్రులయొక్క మౌధ్యము, బాల్యము, వార్ధక్యము, చాతుర్మాస్యకాలము, శూన్యమాసము మంచివికావు. స్థిరలగ్నములు, ద్విస్వభావ లగ్నములు మంచివి, వృషభ లగ్నము ప్రశస్తమైనది. ద్వాదశశుద్ధి ఉండవలెను.
కేంద్ర త్రికోణములయందు పాపులు వుండకూడదు. శుభులు కేంద్ర కోణములయందున్నను పాపులు 3,6,11 రాశులయందున్నను
ప్రశస్తమైనది. చంద్రబలము గృహ్రవేశమునకు ముఖ్యముగా చూడతగినది. కలశ వృషభచక్రముల ఫలములను గూడా చూచుట యుక్తము.
0 కామెంట్‌లు