Surya Grahan december 2019

డిసెంబర్ 26, సంపూర్ణ సూర్యగ్రహణం  26-12-2019


హైదరాబాదు నందు ఉ. 8 :08 నిముషాలకు ప్రారంభమై ఉ. 11 :10 నిమిషాలకు ముగుస్తుంది.
 గ్రహణ సమయంలో సూర్యుడు అగ్నివలయంలాగా కనపడతాడు. గ్రహణ సమయంలో  ద్వాదశ రాశులవారు ఈ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది.
గ్రహణ సమయం తీసుకోవలసిన జాగ్రత్తలు :
  • ఈ గ్రహణాన్ని గర్భిణి స్త్రీలు చూడ కూడదు. ప్రశాంతగా ఉండి  మనస్సులో ఇష్ట దైవాన్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.
  •  గర్భిణి స్త్రీలు ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును. 
  • ఆ వేళలో ఆహార పానీయ నియమాలు -  25.12.2019 రోజు రాత్రి 8.00 గంటల కు ముందే భోజనాలు ముగించాలి. అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, జ్యూసులు(ద్రవ పదార్ధాలు) తీసుకోవచ్చును.
  • ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు. గ్రహణము తర్వాత తలస్నానంచేసి అప్పుడు వంట చేసుకొని తినాలి.  ఎందుకంటే గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పధార్ధాలు విషస్వభావాన్ని కలిగి ఉంటాయి అని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు.
పూజలు జపాలు :
గ్రహణము పట్టుటకు ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవత్ స్మరణతో ఉండగలిగితే, మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలో ఫలితం లభిస్తుంది. ముసలివారు, చిన్నపిల్లల్లు, గర్భినిలు, అనారోగ్యంతో ఉన్నావారు చేయనవసరం లేదు . 
  • గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవుణ్ణి శుద్ధి చేసుకోవాలి.
  • జంద్యం (గాయత్రి) వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.
  • విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.
  • ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోక్తంగా కూశ్మాండా (గుమ్మడికాయ) పూజా విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి.
  • మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు. పూజలు చేయించుకున్న తర్వాత ఆవుకు తోటకూర, బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి, పేదలకు ఏదేని ఆహర, వస్త్ర, వస్తు రూపంలో ధానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహభాదలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది.
వివిధ రాశులకు గ్రహణఫలితాలు :
*మేష రాశి  ........ చింత
 వృషభ రాశి............సౌఖ్యం
*మిధునరాశి ............. స్త్రీ కష్టం 
*కర్కాటకరాశి   .........అతికష్టం 
*సింహరాశి     .....మాన నాశనం 
కన్యారాశి    ......................సుఖం 
తులారాశి ..............‌..........లాభం
*వృశ్చికరాశి ...................ఖర్చు 
*ధనుర్రాశి  ....................ఘాతం
*మకరరాశి....................హాని 
కుంభరాశి ..........‌.......ధన లాభం 
మీనరాశి ........‌‌............వ్యధ
పై వ్యతిరేక రాశుల వారు 

దానములు :
బియ్యం 1 1/4 kg
తెల్ల వస్త్రము
వెండి సూర్యబింబము  1
వెండి సర్పం 
రాగి పాత్ర 
ఆవు నెయ్యి 
గోధుమలు. 1 1/4 kg
దానం చేసిన మంచిది 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు