గ్రహముల ఉచ్చ, నీచ, మూలత్రికోణాలు
రవి మేషంలో 10°
చంద్రుడు వృషభంలో 3°
గురుడు కర్కాటకంలో 5°
బుధుడు కన్యలో 15°
శని తులలో 20°
కుజుడు మకరంలో 28°
గ్రహముల నీచ స్థానాలు
శని మేషంలో 20°
కుజుడు కర్కాటకంలో28°
శుక్రుడు కన్యలో 27°
రవి తులలో 10°
గురుడు మకరంలో 5°
చంద్రుడు వృశ్చికంలో 3°
బుధుడు మీనంలో 15°
శని మేషంలో 20°
కుజుడు కర్కాటకంలో28°
శుక్రుడు కన్యలో 27°
రవి తులలో 10°
గురుడు మకరంలో 5°
చంద్రుడు వృశ్చికంలో 3°
కుజుడు మేషంలో 0° - 12°
చంద్రుడు వృషభంలో 3°- 30°
రవి సింహంలో 0° - 20°
బుధుడు కన్యలో 15° - 20°
శుక్రుడు తులలో 0° - 15°
గురుడు ధనుస్సులో 0° - 10°
శని కుంభంలో 0° - 20°
చంద్రుడు వృషభంలో 3°- 30°
రవి సింహంలో 0° - 20°
బుధుడు కన్యలో 15° - 20°
శుక్రుడు తులలో 0° - 15°
గురుడు ధనుస్సులో 0° - 10°
శని కుంభంలో 0° - 20°
1. ఉచ్చ స్థానము అనగా ఆ గ్రహమునకు అది బలమయిన స్థానము.
2. నీచ స్థానము అనగా ఆ గ్రహమునకు అది బలహీనమయిన స్థానము.
3. ఉచ్చలో లేదా నీచలో ఉన్న గ్రహము ఇచ్చు ఫలితము ఆయా లగ్నములకు ఆ గ్రహము శుభుడా ఆశుభుడా అన్న దానిపై ఆధారపడి ఉండును.
4. ఉచ్చ స్థానములకు ఎదురిల్లు అనగా సప్తమము ఆ గ్రహమునకు నీచ స్థానము.
5. ఉచ్చ స్థానములో ఉన్న గ్రహము ఆయా లగ్నములకు శుభ గ్రహమయిన అధిక బలవంతుడై రెండింతల శుభ ఫలమును ప్రసాదించును.
6. ఉచ్చ స్థానములో ఉన్న గ్రహము ఆయా లగ్నములకు అశుభ/పాప గ్రహమయిన అధిక బలవంతుడై రెండింతల అశుభ/పాప ఫలమును ప్రసాదించును.
7. నీచ స్థానములో ఉన్న గ్రహము ఆయా లగ్నములకు శుభ గ్రహమయిన బలహీనుడై అర్ద బలముతో శుభ ఫలమును ప్రసాదించును.
8. నీచ స్థానములో ఉన్న గ్రహము ఆయా లగ్నములకు అశుభ/పాప గ్రహమయిన బలహీనుడై అర్ద బలముతో అశుభ ఫలమును ప్రసాదించును.
శుభ గ్రహము ఉచ్చస్థానమందు ఉన్నా నీచ స్థానమందు ఉన్న శుభమే చేస్తాడు అశుభము చేయడు. స్థాన బలము ఉన్నది కావున బలా బలములు గమనించాలి.
అశుభ గ్రహము ఉచ్చ స్థానమందు ఉన్న నీచ స్థానమందు ఉన్న ఆశుభమే/పాప ఫలమే ఇస్తాడు కాని శుభఫలము ఇచ్చు అధికారము లేదు. స్థాన బలము అనుసరించి బలా బలములు గమనించాలి.
కేవలము గ్రహము ఆయా లగ్నమునకు శుభ గ్రహమా, అశుభ/పాప గ్రహమా అనునది ముఖ్యము.
1. శుభుడై శత్రు స్తాములో ఉచ్చ స్థితి పొందిన గ్రహము ఆయా లగ్నములకు నీచముగా అధికముగా మేలుచేయును.
2. శుభుడై మిత్ర స్థానములో/స్వక్షేత్రములో ఉచ్చ స్థితి పొందిన గ్రహము ఆయా లగ్నములకు ఉత్తమముగా అధికముగా మేలుచేయును.
3. శుభుడై శత్రు స్తాములో నీచ స్థితి పొందిన గ్రహము ఆయా లగ్నములకు నీచముగా అల్పముగా మేలుచేయును తక్కువ బలము కలిగి ఉండును.
4. శుభుడై మిత్ర స్థానములో/స్వక్షేత్రములో నీచ స్థితి పొందిన గ్రహము ఆయా లగ్నములకు ఉత్తమముగా అల్పముగా మేలుచేయును తకువ బలము కలిగి ఉండును.
5. అశుభుడై శత్రు స్తాములో ఉచ్చ స్థితి పొందిన గ్రహము ఆయా లగ్నములకు నీచముగా అధికముగా కీడుచేయును.
6. అశుభుడై మిత్ర స్థానములో/స్వక్షేత్రములో ఉచ్చ స్థితి పొందిన గ్రహము ఆయా లగ్నములకు అధికముగా కీడుచేయును.
7. అశుభుడై శత్రు స్తాములో నీచ స్థితి పొందిన గ్రహము ఆయా లగ్నములకు అల్పముగా కీడు చేయును తక్కువ బలము కలిగి ఉండును.
8. అశుభుడై మిత్ర స్థానములో/స్వక్షేత్రములో నీచ స్థితి పొందిన గ్రహము ఆయా లగ్నములకు అల్పముగా కీడుచేయును తకువ బలము కలిగి ఉండును.
0 కామెంట్‌లు