షోడశవర్గులు : (shodasa vargas)
ఈ వర్గ చక్రాలలో ప్రధానమైన వర్గ చక్రాలను షోడశ వర్గులు అంటారు.షడ్వర్గులు: 6 వర్గులు
1. రాశి,
2. హోర,
3. ద్రేక్కాణం,
4. నవాంశ,
5. ద్వాదశాంశ,
6. త్రిశాంశ.
సప్త వర్గులు: 7 వర్గులు
1. రాశి,
2. హోర,
3. ద్రేక్కాణం,
4. నవాంశ,
5. ద్వాదశాంశ,
6. త్రిశాంశ.
7. సప్తమాంశ
దశ వర్గులు : 10 వర్గులు
1. రాశి,
2. హోర,
3. ద్రేక్కాణం,
4. నవాంశ,
5. ద్వాదశాంశ,
6. త్రిశాంశ.
7. సప్తమాంశ
8. షోడశాంశ
9. దశాంశ
10. షష్ట్యంశ
షోడశవర్గులు : 16 వర్గులు.
షోడశవర్గులు
|
||
రాశి (Rasi)
|
300/1
|
శరీరం
|
హోర (Hora)
|
300/2
|
సంపద, హోదా
|
ద్రేక్కాణం (Drekkana)
|
300/3
|
సోదరులు/సహకారం, ఆయుర్ధాయం
|
చతుర్ధాంశ (Chaturtamsa {Turyamsa})
|
300/4
|
అదృష్టం, సౌఖ్యం, వాహనం
|
సప్తమాంశ (Saptamansa)
|
300/7
|
సంతానం
|
నవాంశ (Navamsa)
|
300/9
|
వివాహం
|
దశాంశ (Dasamsa)
|
300/10
|
వృత్తి / ఉద్యోగం
|
ద్వాదశాంశ (Dvadasamsa)
|
300/12
|
తల్లిదండ్రులు, స్థిరాస్తులు
|
షోడశాంశ (Shodasamsa {Kalamsa})
|
300/16
|
ఆనందం
|
వింశంశ (Vimsamsa)
|
300/20
|
ఆధ్యాత్మిక విషయాలు
|
చతుర్వింశాంశ (Chaturvimsamsa)
|
300/24
|
ఉన్నత విద్య, ఆధ్యాత్మిక విద్య
|
భంశ (Bhamsa {Saptavimsamsa})
|
300/17
|
మానసిక, శారీరక
శక్తి
|
త్రిశాంశ (Trimsamsa)
|
300/30
|
మానసిక, శారీరక
రోగాలు
|
ఖావేదంశ (Khavedamsa {Chatvarimsamsa})
|
300/40
|
మంచి, చేడు సమయ నిర్ణయం, స్పెక్యులేషన్
|
అక్షవేదంశ (Akshavedamsa)
|
300/45
|
పూర్వ జన్మ పుణ్యం
|
షష్ట్యంశ (Shastiamsa)
|
300/60
|
గ్రహ బలాబలాలు
|
హోర
రాశిని రెండు సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము 15భాగల ప్రమాణమగును. బేసి రాశియందు మెుదటి సగభాగము రవిహోర, రెండవ సగభాగము చంద్రహోర. సమరాశియందు మెుదటి సమభాగము చంద్రహోర. రెండవ సగభాగము రవిహోర.
ద్రేక్కాణము
రాశిని 3 సమ భాగములు చేయగా ఒక్కాక్క భాగము 10 బాగల ప్రమాణమగును. మెుదటి భాగమునకు ఆ రాశ్యాధిపతియే ద్రేక్కాణధిపతి. రెండవ భాగమునకు ఆ రాశికి పంచమ రాశ్యాధిపతి ద్రేక్కాణాధిపతి. మూడవ భాగమునకు ఆ రాశికి నవమ రాశ్యాధిపతి ద్రేక్కాణాధిపతియగును.
చతుర్థాంశ
రాశిని నాలుగు సమ భాగములు చేయగా ఒక్కొక్క భాగము7 భాగల 30 లిప్తలు లేక నిమిషములు అగును.
మెుదటి భాగమునకు ఆరాశ్యాధిపతియు, రెండవ భాగమునకు ఆరాశికి చతుర్థాధిపతియు, మూడవ భాగమునకు ఆరాశికి సప్తమాధిపతియు, నాల్గవ భాగమునకు ఆ రాశికి దశమాధిపతియు అధిపతులగుదురు.
సప్తమాంశ
రాశిని 7 సమభాగములు చేయగా సంప్తమాంశయగును. ఒక్కొక్కభాగము 4భాగలు 17 1/7 లిప్తలగును. మేషమునకు కుజునితో ప్రారంభింప వలెను. వృషభమునకు వృశ్చిక కుజునితో ప్రారంభింపవలెను.మిథునమునకు మిథున బుధునితోను, కర్కాటకమునకు మకర శనితోను, సింహమునకు రవితోను, కన్యకు మీన గురునితోను, తులకు తులా శుక్రునితోను, వృశ్చికమునకు వృశభ శుక్రునితోను, ధనస్సునకు ధనస్సు గురునితోను, మకరమునకు చంద్రునితోను, కుంభమునకు కుంభ శనితోను, మీనమునకు కన్యాబుధునితోను ప్రారంభించవలెను.
నవమాంశ
రాశిని తొమ్మిది భాగములు చేయగా నవమాంశ యగును. ఒక్కొకక్క భాగము 3 భాగల 20 లిప్తలు.
మేష ,సింహ,ధనస్సులకు మేషాదిగను; కర్కాట,వృశ్చిక,మీనములకు కర్కాటకాదిగను; వృషభ,కన్య,మకరములకు మకరదిగను; మిథున,తుల,కుంభములకు తులాదిగను
నవాంశలను గుణించవలెను. మేష ,సంహ,ధనుస్సుల యెక్క నవాంశలకు మేషము మెుదలుకొని తొమ్మిది రాశుల యెక్కయధిపతులే యెక్కొక్క నవాంశమునకు అధిపతులనియును, కర్కాటక , వృశ్చిక,మీనములకు కర్కాటకాదిగను నవరాశుల అధిపతులు నవరాశుల అధిపతులు నవాంశాధి పతులనియును;
వృషభ,కన్య,మకరములకు మకరాదిగ నవరాశ్యాధిపతులు నవాంశధి పతులనియును; మిథున,తుల ,కుంభములకు తులాదిగా నవరాశ్యధిపతులు నవాంశాధిపతులనియును గ్రహించవలెను.
దశాంశ
రాశిని 10 సమభాగములు చేేయగా దశాంశ ప్రాప్తించును. ఇది యెుక్కొక్క భాగము 3 భాగలగును.
మేష మెుదటి దశాంశ మేష కుజునితో ప్రారంభమై మకర శనితో అంతమగును. వృషభ మెుదటిదశాంశ మకర శనితో ప్రారంభమై తుల శుక్రునితో అంతమగును. ఓజరాశులకు ఆ రాశిమెుదలు,యుగ్మరాశులకు
ఆ రాశికి తొమ్మిదవ రాశిమెదలు దశాంశ రాశులగును. ఆయా రాశ్యాధిపతులే ఆంశాధిపతులగుదురు.
ద్వాదశాంశ
రాశిని 12సమ భాగములు చేయగా ద్వాదశాంశయగును. ఇది 2 భాగల 30 లిప్తల ప్రమాణము గలది.
ఈ అంశలకు అధిపతులు ఆయా రాశ్యాధిపతుల నుండి క్రమముగానుండును.
షోడశాంశ
రాశిని 16 సమ భాగములు చేయగా షోడశాశయగును. ఒక్కొక్కభాగము 1భాగ 52 లిప్తల 30 విలిప్తలు, మేష,కర్కట,తుల,మకరములకు మేష కుజాది చంద్రుని వరకు; కర్కట,సింహ,వృశ్చిక,కుంభములకు రవ్యాది వృశ్చిక,కుజునివరకు; మిథున,కన్య,ధనుర్మీనములకు,ధనస్సుగురు మెుదలు మీన గురుని వరకు అధిపతులు.
వింశాంశ
రాశిని 20 సమ భాగములు చేయగా ఒక్కొక్కభాగము1భాగ 30 లిప్తలగును. చరరాశులకు మేష కుజునితోను, స్ఠిరరాశులకు ధనుస్సు గురునితోను, ద్విస్వభావ రాశులకు రవితోను అధిపతులు ప్రారంభమదురు.
చతుర్వింశాంశ
రాశిని 24 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము 1 భాగ 15 లిప్తలగును. బేసి రాశులకు రవ్యాదిగను,
సమ రాశులకు చంద్రాదిగను గ్రహములు అధిపతులగుదురు.
భాంశ
రాశిని 27 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము. 1 భాగ 6లిప్తల 40 విలిప్తల ప్రమాణమగును.
ప్రతిరాశికి ఆ రాశినాధునితో ప్రారంభమై క్రమముగా 27 గ్రహములు భాంశనాధులగుదురు.
త్రింశాంశ
రాశిని 30 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము 1భాగ ప్రమాణమగును. ఓజరాశులందు మెదటి 5 భాగలకు కుజుడు. 5నుండి 10 వరకు శని, 10నుండి 18 వరకు గురుడు, 18 నుండి 25 వరకు బుధుడు, 25 నుండి 30 వరకు శుక్రుడు అధిపతులు. సమరాశులకు మెదటి 5 భాగలకు శుక్రుడు, 5 నుండి 12 వరకు బుధుడు, 12 నుండి 20 వరకు గురుడు, 20 నుండి 25 వరకు శని, 25 నుండి 30 వరకు కుజుడు అధిపతులు.
ఖవేదాంశ
రాశిని 40 సమభాగములు చేయగా ఒక్కొక్క భాగమునకు 45లిప్తల ప్రామాణము ప్రాప్తించును. బేసి రాశులకు మేష కుజాదిగను, సమ రాశులకు తుల శుక్రాదిగను అంశనాధులగుచున్నారు.
అక్ష వేదాంశ
రాశిని 45 సమ భాగములు చేయగా ఒక్కొక్కభాగమునకు 40 లిప్తల ప్రమాణము ప్రాప్తించును. చర రాశులకు మేషాదిగను, స్ఠిర రాశులకు సింహదిగను, ద్విస్వభావ రాశులకు ధనురాదిగను గ్రహములు అధిపతులగుదురు.
షష్ట్యంశ
రాశిని 60 భాగములు చేయగా ఒక్కొక్క భాగము 30 లిప్తల ప్రమాణమగును. బేసి రాశులందు మెుదటి రెండుపాప షష్ట్యంశలు. 3 నుండి 6 వరకుశుభము, 7నుండి 12వరకు పాపము, 13-14 శుభము, 15.పాపము, 16 నుండి 20 వరకు శుభము, 27 పాపము, 28-29 శుభము, 30 నుండి 36 వరకు పాపము, 37 నుండి39 వరకు శుభము, 40-14 పాపము, 42 శుభము, 43-44 పాపము, 45 నుండి 48 వరకు శుభము, 49-50 పాపము, 51 శుభము, 52 పాపము, 53 నుండి 58 వరకు శుభము, 59 పాపము, 60 శుభము, సమ రాశులు 1 శుభము. 2 పాపము, 3 నుండి 8 వరకు శుభము, 9 పాపము.10 శుభము, 11-12 పాపము.13 నుండి 16 వరకు శుభము, 17-18 పాపము.19 శుభము.20-21 పాపము, 22 నుండి 24 వరకు శుభము, 25 నుండి 31 వరకు పాపము, 32-33 శుభము, 34 పాపము. 35 నుండి 45 వరకు శుభము, 46 పాపము.47-48 శుభము, 49 నుండి 54 వరకు పాపము, 55 నుండి 58 వరకు శుభము, 59-60 పాపము.
0 కామెంట్‌లు