Dharmasukshmas to be followed daily


నిత్యమూ పాటించవలసిన ధర్మసూక్ష్మాలు 

























  • తల్లిదండ్రులకు నిత్యం నమస్కరించడాన్ని మించిన ధర్మం, నిత్య అన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలోనే లేవు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంలా పూజించాలి.­
  •  భోజనం చేసేటప్పుడు తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని మాత్రమే భోజనం చేయాలి. అన్నమును దూషించరాదు, అన్నం పెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లో తిట్టరాదు.
  • ఉదయం నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను చూసుకొని దైవనామస్మరణ చేయాలి.
  • ఎంగిలి ఆకులు ఎత్తిన వారికి అన్నదానం చేసిన వారి కంటే ఎక్కువ పుణ్యం వస్తుంది.
  • వస్త్రాలనయినా ధరించి భోజనం చేశాక, వాటితో దైవపూజలో కూర్చోరాదు. వాటిని ఉతికి ఆరవేసిన పిదప వాటిని ధరించి పూజ చేసుకోవచ్చు.
  •  ప్రదక్షిణలు చేయునపుడు,  మంత్ర పుష్పం చదివేటపుడు కింద నేలపై నిలబడాలి.
  • దీపాన్నినోటితో ఆర్పరాదు.
  • అసలు దేవాలయమే లేని ఊరిలో భోజనం చేయరాదు. శివర్చనును స్త్రీలు కూడా చేయవచ్చు.
  •  ఒకరు ధరించిన చెప్పులు, వస్త్రాలు ఇంకొకరు ధరించరాదు. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
  • ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట చేయరాదు. నిలబడిఅన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. ఒళ్ళో కంచం పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు.
  •  పండితులకు, గురువులకుతల వెంట్రుకలతో కూడిన అన్నం పెట్టరాదు. భోజనానికి ముందు, తిన్న తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవాలి.
  • పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. గిన్నె మొత్తం తుడుచుకొని తినుట, భోజనసమయంలో వేదములు చదవరాదు.
  • అసత్యం పలికే వాడితోగాని, భర్తను ఎప్పుడు తిట్టే స్త్రీతోగాని, శత్రువుతో గాని, పిసినిగొట్టుతోగాని కలిసి భోజనం చేయటం మహాపాపం.
  •  ప్రతిరోజూ స్నానం చేసి వంట చేయవలేను.  అలా చేయనిచో ఆ అన్నం తినరాదు. పురాణాలు, ఇతిహాసాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. వారిని ఎన్నడూ నిందించరాదు. పురాణాలు, ఇతిహాసాలు దానం చేస్తే వారు గొప్ప విద్యావేత్తలు అవుతారు.
  • తల్లిని బిడ్డను వేరుచేయుట, రాత్రి నిద్రిస్తున్నవారిని అనవసరంగా లేపుట, పురాణకథలు వింటున్నప్పుడు విఘ్నం కలిగించుటభార్యాభర్తలను వేరుచేయుట - బ్రహ్మహత్యాపాతకాలతో సమానం.
  • సోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి పుణ్య కార్యాలు చేయునప్పుడు ఉపయోగించరాదు. చద్ది(నిల్వఉన్న) పదార్థాలు తినరాదు.
  • ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. అలా చేసుకున్నవారు కొన్నివేల జన్మలు పిశాచాలుగా, వికలాంగులుగా పుడతారు.
  • పుష్కర నదీస్నానము చేయునపుడు వస్త్రము ధరించి (కండువాతో) మాత్రమే స్నానం చేయవలెను. నదీస్నానం సంకల్పం చేసి చేయవలెను. అలా సంకల్పం చేయకుంటే సాదారణంగా ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం.
  • తులసి చెట్టు నుండి ఆదివారం, శుక్రవారం, మంగళవారాలలో ఆకులు కోయరాదు. చీకటి పడ్డాక చెట్ల ఆకులు, పువ్వులు కోయరాదు.
  • నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ నిందించిన వారి తలకు చుట్టుకుంటాయి.
  • ఎవరయినా శవాన్ని తమ ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా, శవాన్ని స్మశానం దాకా మోసినా వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది.
  • దానం చేస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు. వాక్ భంగం చాలా దోషం,
  • మంచి మగనితో తాళికట్టించుకొన్నభార్య కాపురం చేయక ఏడిపించటం, మాట వినకపోవటం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి తదుపరి జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
  • ఒకసారి వెలిగించాక దీపం వత్తిని తీసివేసి మరల క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడితే మూడు వత్తులు వేయాలి. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలలోనూ చెప్పలేదు. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు.
  • గురువుగారు, పిల్లనిచ్చిన మామగారుఅన్నగారు - ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం.
  • ఒక చెట్టును నరకాలంటే ముందుగా పది మొక్కలు నాటాలి.
  • సంతోషంగా వుంటే ఐశ్వర్యం ఏడవటంవల్ల దారిద్య్రం లభిస్తాయి.
  • తనను తాను చీటికి మాటికి నిందించుకొనుట, తక్కువ చేసుకొనుట, అవమానించుకొనుట చేయరాదు. చీటికి మాటికి ఒట్టు పెట్టుట ప్రతిజ్ఞలు చేయుట దోషం. గోళ్ళుకొరుకుట, నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట చేయరాదు.
  • దేవాలయం నీడను, దేవతల నీడనుగోబ్రాహ్మణుల నీడను, యజ్ఞం చేసే వారి నీడను,  దాటరాదు.
  • ఈశాన్యం అనగా ఈశ్వరస్థానం. ఈశాన్యంలో దేవతా విగ్రహాలుచెట్లు ఉండగా వాటిని వాస్తు పేరుతో బరువులుగా భావించి తీసివేసేవారు, అలా తీసివేయమని సలహా ఇచ్చేవారు రాబోయే ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం.
  • తల్లిదండ్రులపై, గురువుపై చేయి ఎత్తరాదు. వారికి పెట్టకుండా ఏ పదార్థాలు తినరాదు. వారిని వృద్ధాశ్రమాలలో వుంచారాదు.
  • రావి చెట్టుకు పూజించుట, మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయుట, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళును దానం చేయుట - అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.
  • తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అ ఎంగిలి అరచేతిని తలపై రాసుకొనరాదు.
  • పాడయిపోయిన దేవుని పటాలుగాని విగ్రహాలుగాని బయట పారవేయరాదు. కాలువలో గాని, చెరువులో గాని, సముద్రంలో గాని కలుపవలెను. అలా కుదరకపోతే ఒక గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను.
  • కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. ఉపవాసం, జాగరణ చేస్తున్నపుడు, ఇతరుల దోషాలు తలుచుకోరాదు.
  • ఉత్తర, పశ్చిమ దిక్కల వైపు తల పెట్టి నిద్రించరాదు. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి మాత్రమే నిద్రపోవాలి.
  • పుత్రుడు జన్మించిన వార్త వినగానే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఒకవేళ ఆ పుత్రుడు మరణించినట్లైతే తండ్రితోపాటు ఆ కుటుంబమంతా కట్టుబట్టలతో స్నానం చేయాలి.
  • కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. కొబ్బరికాయను పీచు తీశాక మళ్ళీ నీళ్ళతో కడగరాదు.
  • పండితులకు ఆకులలో లేదా మనం వాడని (క్రొత్తవి) పాత్రలలోకాని మాత్రమే ఆహారం పెట్టాలి.
  • స్వయంపాకం అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో ఎవరికయినా దానం చేస్తే దానమిచ్చిన వారికి ఎన్నటికీ అన్నపానాలకు లోటుండదు.
  • మంత్రోపదేశం చేసినవారిని మాత్రమే గురువు అంటారు. (ఇతర  విద్యలు నేర్పినవారు కేవలం అధ్యాపకులు మాత్రమే)
  • గృహ నిర్మాణ మొదలు పెట్టిన ఏడాదిలోపు గాని, గృహప్రవేశ కాలంలో గాని ఆ ఇంట మణిద్వీప వర్ణన పరాయణం చేయడం ఎంతో మంచిది.
  • తలకి నూనె రాసుకొని ఆ చేతులతో కాళ్ళకు, వొంటికి ఆ జిడ్డు పులమరాదు.
  • సకల పురాణేతిహాస కోవిదుని వద్దనే మంత్రోపదేశం పొందవలెను.
  • శుక్రవారం, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు చేయుట, ఆరోజు తినే అల్పహారాల్లో ఉల్లి వాడుట - నిషేదము. ప్రయాణంలో ఉన్న వారికి ఇది వర్తించదు.
  • మన ఇంటికి గురువుగారు వచ్చినపుడు లేచి నిలబడి ఎదురుగావెళ్ళి, లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి, కూర్చోబెట్టి మంచినీరు ఇవ్వకుండా మాట్లాడరాదు. గురువుగారు బయలుదేరునపుడు బయటకు వచ్చి, కొంచెం దూరం వారిని అనుసరించి సాగానంపాలి.
  • చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం - రెండూ భయంకర దోషాలే.
  • జపమాలను మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్నమాలతో జపం చేయరాదు.
  • బంగారం దొరికితే దానిని ఇంట్లోకి దాచుకోవడం లేదా ధరించడం మంచిదికాదు. దొరికిన బంగారాన్ని దానం చేయాలి, లేదా దేవాలయంలో ఇచ్చివేయాలి. 
  • శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. కేవలం అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు.
  • మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.
  • బంధువులలో కానీ, సన్నిహితులలో ఎయవరాయినా మరణించిన వార్త గాని, పురిటి వార్త గాని వినగానే కట్టుబట్టలతో స్నానం చేయాలి.
  • ఎట్టి పరిస్థితులలో అబద్ధములు ఆడరాదు. ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను.
  • భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు. అన్నము తిన్న పళ్ళెంలో చేయి కడుక్కోరాదు. ఓకవేళ కడిగితే, ఆ చేతిని విదల్చరాదు.
  • తడి కాళ్ళతో భోజనం చేయరాదు. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. గోళ్ళుకొరుకుట, నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట చేయరాదు. ఏడుస్తూ అన్నం తినరాదు.
  • గుడికి వెళ్ళేటప్పుడుగాని, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడుగాని, గురువు గారి దర్శనానికి వెళ్ళేటప్పుడుగాని, చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడుగానిఅనారోగ్యంతో ఉన్నవారి దగ్గరికి వెళ్ళేటప్పుడుగాని, ఖాళీ చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి తప్పకుండా తీసుకువెళ్లాలి.
  • ధ్వజస్తంభం లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశంలో నివాసం ఉండకూడదు. 
  • కాలిబొటనవేలిని నేలకి  రాయకూడదు. కొంతమంది కాలిబొటన వేలును నేలకు రాస్తూ సిగ్గుపడతారు.  బొటన వేలు నందలి నరాలతో గర్భానికి, హృదయానికి రక్తం సరఫరా ఉంటుంది. వాటిపై ఒత్తిడి తేవడం ఆరోగ్యరీత్య అంత మంచిది కాదు.
  • స్వామికి వెలిగించే దీపం నూనెతో వెలిగిస్తే ఎడమవైపు అంటే మనకు కుడివైపు , అదే ఆవు నెయ్యితో అయితే స్వామి కుడివైపున, అనగా మనకి ఎడమవైపుగా వెలిగించాలి.  దీపపు వత్తులు తూర్పు, ఉత్తరం వైపు ఉంచాలి. మిగతా రెండు దిక్కులు దీపారాధనకు పనికి రావు. స్వామివారికి రెండు వైపులా దీపాలు వెలిగిస్తే అసలు  సమస్యేలేదు.
  • దేవాలయంలో స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేయరాదు. ధ్వజస్తంభానికి అవతల చేయాలి. గృహంలో పూజాదికాలు పూర్తయ్యాక పురుషులు స్వామికి  సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడ వారు మాత్రం మోకాలి పై వంగి నమస్కారం చేయాలి.
  • శుక్రవారం లక్ష్మీదేవి , సరస్వతీదేవి , గణపతి పూజలు ఏమిచేసిన పూజ చేస్తున్నప్పుడు ఆవాహన చేయాలి గాని , పూజానంతరం ఉద్వాసన చేయరాదు.
  • సకల పూజ ద్రవ్యములను పూజా సమయంలో దక్షిణ భాగం వైపు మాత్రమే ఉంచుకోవాలి.
  • ఇంట్లో చెట్టే కదా అని చెట్టుకు పూసిన పువ్వులన్నీ కోయకూడదు. పూలు లేని చెట్టుని చూడకూడదు. 
  • స్టీలు వంటి పళ్ళెములలొ  పూజ ద్రవ్యములు ఉంచుట, అక్షింతలు కలుపుట, గౌరీదేవిని తయారుచేయుట చేయకూడదు.
  • ఒకేసారి డబ్బా నిండా అక్షింతలు చేసుకొని అవే వాడకూడదు.ఏరోజు పూలు ఆ రోజు వాడినట్టుగా అక్షింతలను వాడాలి.
  • మన గృహంలో ఏ దేవతా విగ్రహమయినా రెండు అంగుళాలు మించి ఉండకపోతే మంచిది. ఆ ఎత్తు దాటితే  మీరు చేసేటువంటి పూజలు దేవతామూర్తులకు తృప్తినివ్వవు. దానివల్ల  దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.
  • కుంకుమ పూజ చేస్తున్నప్పుడు  ఆ కుంకుమ అమ్మవారి ముఖం మీద పడేలా పూజ చేయకూడదు.
  • శ్రీ మహలక్ష్మి దేవిని, అమ్మవారి అంశ గల వారిని,  లక్ష్మి దేవి  ప్రియనాధుడు అయిన శ్రీమహావిష్ణువుని మందార పుష్పాలతో పూజిస్తే, శ్రీ మహలక్ష్మి ఆశీర్వాదం కూడా లభిస్తుంది.
  • జంటఫలాలను  తినటం వలన, స్వామికి అర్పించటం వలన , ఎలాంటి దోషము రాదనీ శాస్రాలు చెబుతున్నాయి. 
  • తాంబూలంలో జంట అరటిపండును పెట్టకూడదు. దానికి కారణం ఆ జంట అరటిపండ్లు  ఏకఫలమని భావము.

 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు