Vastu Sastra

వాస్తు ప్రకరణము : (Vastu Sastra)

"వసంత్యస్మిన్నితి  వాస్తు" ఉండదగిన వసతిని (ఇల్లు) గురించి చెప్పునది వాస్తు. అనగా వసించుటకు వీలైనది 'వాస్తు' అని అర్ధం. 


'భూరేవముఖ్యవస్తస్యాత్ తత్ర జాతా నియానిహి' (మయ వాక్యం) భూమి, ప్రాసాదము, యానము,శయనము అను నాలుగింటిలో భూమి మొదటిది. దానికి వస్తువు అన్న పేరు సిద్ధిస్తుంది. ఈ వస్తువునందు నిర్మించే నగర, దేవళ, గృహ, భావనాది నిర్మాణ విశేషాలకు వాస్తువు అనే పేరు కలిగినది. 


గృహ నిర్మాణ ప్రాశస్త్యం:


స్రీ పుత్రాదిక భోగ సౌఖ్య జనకం ధర్మార్ధకామప్రదమ్!
జంతూనాం లయవం సుఖాస్పద మిదం శీతాంబు ఘర్మాపహమ్!!

వాపీ దేవ గృహాది పుణ్యమఖిలం గేహత్సముద్యతే!
గేహం పూర్వము శన్తి  తేన విబుధా శ్రీవిశ్వకర్మాదయే!!        

    భార్యాపుత్రులకు గృహం సుఖాన్ని కలిగిస్తుంది. ధర్మార్ధకామ మోక్షాలనే పురుషార్ధాలు నిర్వహించడానికి తత్ఫలం పొందడానికి గృహం ముఖ్యమైనది.  గృహస్థులు కానీ సన్యాస, పరివ్రాజక ఆశ్రమస్తులకు బధిర, అంధక,  పంగువులకు కూడా సాయపడుతుంది. చల్లని నీటివలే చమటను పోగొట్టి సుఖాన్ని కలిగిస్తుంది. బావులు,  దేవతా గృహాలు,  గృహస్థులు నిర్వహించవలసిన సమస్తం గృహం వల్లనే కలుగుతుంది. 
    కాబట్టి గృహ నిర్మాణం అత్యంత ముఖ్యమైనది. శాస్త్రబద్ధంగా నిర్మించుకొని శుభఫలితాలు పొందుటకు వాస్తుశాస్త్ర పద్ధతి అవసరం. 





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు